ETV Bharat / state

ఆకలి తీర్చలేక శిశువు విక్రయం.. గ్రామస్థుల ఆపన్నహస్తం - baby selling news in ananthapuram

కరోనా.. కరోనా.. ఏం చేసిందంటే..? తల్లికి బిడ్డలను దూరం చేసింది. కళ్ల ముందే అయినవారు చనిపోతున్నా.. దగ్గరికి చేరలేని నిస్సహాయులుగా మిగిలేలా చేసింది. బంధాలు, బంధుత్వాలు కనుమరుగయ్యేలా చేసింది. ఎంతో మందికి ఆకలి చావులను మిగిల్చింది. లాక్​డౌన్​ వల్ల పనులు లేక.. ఆకలి బాధ భరించలేక ఎనిమిది నెలల ఆడపిల్లను బిచ్చగాళ్లకు అమ్ముకునే దయనీయ పరిస్థితి కల్పించింది.. అని చెప్పొచ్చు. ఉపాధి లేక.. బిడ్డకు కనీసం పాలివ్వలేక తమ గారాలపట్టిని బిచ్చగాళ్లకు అమ్ముకున్న దయనీయ ఘటన వివరాలివి..!

ఆకలి తీర్చలేక శిశువు విక్రయం.. గ్రామస్థుల ఆపన్నహస్తం..!

author img

By

Published : Jul 25, 2020, 4:26 PM IST

కరోనా కారణంగా ఉపాధి కరువై, కుటుంబ పోషణ భారంగా మారి.. బిడ్డ ఆకలి తీర్చలేక.. తల్లిదండ్రులు ఆ బిడ్డనే అమ్మేసిన ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని బుచెర్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ముత్యాలు, సునీతమ్మ భార్యాభర్తలు. వీరికి ఎనిమిది నెలల కిందట ఓ అమ్మాయి జన్మించింది. కూలీ పనులే వీరి జీవనాధారం. కరోనా లాక్​డౌన్​ కారణంగా దాదాపు మూడు నెలల పాటు వీరికి పనులు దొరకలేదు. కుటుంబమంతా పస్తులుండాల్సిన పరిస్థితి. మరోవైపు సునీతమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో బిడ్డకు కనీసం పాలు సైతం ఇవ్వలేక ఆ చిన్నారిని బిచ్చగాళ్లకు అమ్మేశారు.

గ్రామస్థుల అడ్డగింత.. కుటుంబానికి సహాయం

బిడ్డను అమ్మేసిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. బిచ్చగాళ్లను అడ్డగించి శిశువును తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. తామంతా తోడుగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

చిన్న ముత్యాలకు వచ్చే ప్రభుత్వ పింఛనుతోనే వారు బతుకున్నారని.. ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వారికి అందజేయాలని గ్రామస్థులు కోరారు. గ్రామం తరఫున తాము కూడా సహాయం అందిస్తామని గ్రామ పెద్ద స్పష్టం చేశారు.

స్పందించిన సబ్​కలెక్టర్​

శిశువు అమ్మకం విషయం తెలుసుకున్న సబ్​కలెక్టర్​ హరిప్రసాద్​, అధికారులతో అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి సహాయం అందించారు. ప్రభుత్వం నుంచి ఏవైనా పథకాలు రావాల్సి ఉంటే అందేలా చేస్తామని చెప్పారు. స్పందించిన ఎస్​ఆర్​ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సవిత 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. మరో ఆరు నెలల పాటు ఈ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఇదీ చూడండి..

లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.