అనంతపురం జిల్లా మడకశిర మండలం బసలహల్లి వద్ద పట్టుకున్న శ్రీగంధం చెక్కలు, ఆయిల్ అటవీశాఖ కార్యాలయంలోనే చోరీకి గురయ్యాయి. గతేదాడి ఆగస్టు 13న.. సెంట్ తయారీ పరిశ్రమలో అక్రమంగా నిల్వఉంచిన 188సంచుల శ్రీగంధం చెక్కలు, ఆయిల్‌ను సీజ్ చేసి.. పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో నిల్వ ఉంచారు. వీటిలో 92 సంచుల శ్రీ గంధం చెక్కలు, 16 కిలోల శ్రీగంధం ఆయిల్ చోరీకి గురైంది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించగా చోరీ విషయం బయటపడింది.
చోరీకి గురైన శ్రీగంధం చెక్కలు, ఆయిల్ విలువ రూ.కోటి వరకు ఉంటుంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
ATM Services in Betting: పందెంరాయుళ్ల కోసం ఏటీఎం సేవలు..ఎక్కడో తెలుసా..!