కర్ణాటక నుంచి లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి 39 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి 576 ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. వారి వాహనాలను జప్తు చేశారు. వీరికి మద్యం సరఫరా చేసిన చేలూరు దుకాణం మేనేజర్ శ్రీనివాస రెడ్డి పైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఇవీ చదవండి: బెట్టింగ్ స్థావరం పై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్