అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సివిల్ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామనని గుత్తి సెబీ సీఐ సుహాసిని తెలిపారు. ఈ దాడుల్లో 2,000 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఎవరైనా నాటుసారాను నిల్వ ఉంచి విక్రయించినా, నాటుసారా తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి ఉరవకొండలో మరో 12 మందికి కరోనా.. 20కి పెరిగిన బాధితులు