ETV Bharat / state

వీడని గుబులు.. మోగనున్న బడి గంటలు

విద్యాలయాలు ప్రారంభం పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చినా.. ఎట్టకేలకు నేడు ప్రారంభం కాబోతున్నాయి. ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం బడి గంటలు మోగనున్నాయి. పలు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించే దిశగా ప్రధానోపాధ్యాయులు కసరత్తు పూర్తి చేశారు.

వీడని గుబులు.. మోగనున్న బడి గంటలు
వీడని గుబులు.. మోగనున్న బడి గంటలు
author img

By

Published : Nov 2, 2020, 7:47 AM IST

ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం బడి గంటలు మోగనున్నాయి. పలు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించే దిశగా ప్రధానోపాధ్యాయులు కసరత్తు పూర్తి చేశారు. నాడు-నేడు పనులు జరుగుతున్న వాటిలో ఓ వైపు శుభ్రం చేసినా.. మరో వైపు అలాగే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ నియంత్రణకు తగు జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహిస్తూనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయులు చొరవ చూపకుండా పట్టించుకోకుంటే అసలుకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గేటు వద్దే పరీక్షలు

పాఠశాలల ప్రారంభంపై ప్రధానోపాధ్యాయుల్లో గుబులు పుడుతోంది. విద్యార్థులు పాఠశాలలకు భారీ సంఖ్యలో రానుండటంతో అందరికీ గేటు వద్దే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరం ద్వారా ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. తర్వాతే లోనికి అనుమతి ఇవ్వనున్నారు. పరికరం కోసం ప్రధానోపాధ్యాయులు పరుగులు తీస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే ఆదిమూర్తినగర్‌లో ఉన్న రెండు ప్రాంతాల్లో దక్కే పరికరం కోసం 250మంది ప్రధానోపాధ్యాయులు వివరాలు నమోదు చేసుకున్నారు. నాణ్యమైన పరికరం రూ.1400నుంచి రూ.1200 వరకు ధర ఉన్నా.. కొనుగోలుకు నమోదు చేసుకున్నారు. ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకున్నా.. పాఠశాల నిర్వహణ నిధుల నుంచే పిచికారీ ద్రావకం, పరికరం కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజైనా ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి శానిటైజేషన్‌ చేయించారు. పాఠశాల కమిటీ సమావేశాలు నిర్వహించారు. ప్రతి ఉపాధ్యాయుడు నాలుగు రోజులుగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

9, 10 తరగతులతో ప్రారంభం

సోమవారం 9, 10తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 1056 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 9-10 తరగతుల్లో 1,10,250మంది విద్యార్థులు ఉన్నారు. వారికి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత గురువులపై ఉంది. పాఠశాల నిర్వహణ ఆశాజనకంగా ఉంటే ఈ నెల 23 నుంచి 6నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బడులు ప్రారంభించనున్నారు.

విద్యాలయాలు.. ఇవీ నిబంధనలు

●విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారంతోనే పాఠశాలలోకి అనుమతి ఇవ్వాలి.

●తరగతి గదిలో 16మంది విద్యార్థులే ఉండాలి.

●తొమ్మిదో తరగతికి రోజు విడిచి రోజు, పదో తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావాలి.

●మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. థర్మల్‌ స్కానింగ్‌ చేయాలి.

●ప్రార్థన తరగతి గదిలోనే నిర్వహించి, కొవిడ్‌పై ప్రతిజ్ఞ చేయించాలి.

●గాలి, వెలుతురు బాగా ఉండే ప్రాంతంలోనే తరగతులు నిర్వహించాలి.

●గంటకు ఒకసారి టాయ్‌లెట్‌ను తప్పని సరిగా శుభ్రం చేయించాలి. శానిటైజ్‌ చేయాలి. లిక్విడ్‌ సోపు అందుబాటులో ఉండాలి.

●మధ్యాహ్న భోజనం సమయంలో విడతల వారీగా కొద్ది మందిని అనుమతి ఇవ్వాలి. ఎక్కడా గుంపులు ఉండకుండా చూడాలి.

మార్గదర్శకాలు పాటించాలి

ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలి. పాఠశాలకు పంపినా నివారణా చర్యలు చేపట్టారన్న నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి. ప్రతి పాఠశాలను శానిటైజ్‌ చేయడంతో పాటు కొవిడ్‌ మార్గదర్శకాలు తెలిపారు. ఎక్కడా విద్యార్థులు గుమికూడకుండా జాగ్రత్త వహించాలి. - శామ్యూల్‌, డీఈఓ

ఇదీ చదవండి:

తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.. జాగ్రత్తలు తీసుకున్నాం: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.