అనంతపురం జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదవుతున్న ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై వైద్యాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం విద్యార్థులతో పాటు అక్కడ పని చేసే సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా సోకిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగుందని... హోం క్వారంటైన్ లో ఉంచినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ రావు తెలిపారు.
ఇదీ చదవండి
నివర్ నష్టంపై కేబినెట్ భేటీలో చర్చ.. తక్షణమే పరిహారం ఇవ్వాలని నిర్ణయం