అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గొలపల్లి గ్రామ సమీపంలో కావలికొండ వద్ద రెండు ఎలుగుబంట్లు రైతులను భయందోళనకు గురిచేశాయి. అటువైపుగా ద్విచక్రవాహనాల్లో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు వాటిని చూసి భయపడి అక్కడే నిలబడిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. గతంలో నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడిలో చాలా మంది మృతిచెందారు.
ఇదీ చూడండి:కుక్కలకు కుందేళ్లు... జింకకు మేకపాలు...!!