అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీ వర్గాలకు చెందిన అధికారులపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి రామచంద్రారెడ్డి ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై ఫిర్యాదు తీసుకోవడానికి కదిరి అర్బన్ సీఐ రామకృష్ణ నిరాకరించారు. సీఐ తీరుపై అసంతృప్తికి గురైన తెదేపా నేతలు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేసి మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు.