యూపీలో ఎస్సీ యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ధర్మవరంలో ఐక్య దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ కూడలి వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేసి ఆర్డీవో మధుసూధనకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తుంపర్తి రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :