Sarpanches Agony: అనంతపురం జిల్లా ఉరవకొండ మండల సర్వ సభ్యా సమావేశంలో పలు గ్రామాల సర్పంచ్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కనీసం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడటానికి.. సభ అధ్యక్షుల అనుమతితోనే మాట్లాడాలంటే ఎలా అని వాపోయారు. తమ సొంత డబ్బులతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, బిల్లుల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జోలెపట్టి అడక్కు తినే పరిస్థితి వచ్చిందని షేక్షనుపల్లి సర్పంచ్ లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఉరవకొండ మండల పరిషత్ సమావేశం ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులే మాట్లాడాలని.. సర్పంచులు ఏదైనా ప్రస్తావించాలనుకుంటే ఎంపీపీ అనుమతి తీసుకోవాలని చెప్పడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడటానికి అవకాశం లేనప్పుడు సమావేశంలో ఎందుకు ఉండాలని వైకాపా సర్పంచులైన లింగన్న, రేణుమాకులపల్లి సర్పంచి రామాంజనేయులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మళ్లీ తిరిగిరాగా వాదన చోటుచేసుకుంది. గ్రామాల్లో సమస్యలపై ప్రజలు నిలదిస్తున్నారని.. ఇక్కడ సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదని వాపోయారు. సభలో మాట్లాడటానికి ఎంపీపీ అనుమతి తీసుకోవాలని చెప్పడం దారుణమన్నారు.
ఇవీ చదవండి: