అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేకువజామునే చిన్న, పెద్దా.. కలిసి భోగి మంటలు వేసి వాటి చుట్టూ చేరి సందడి చేశారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, మచ్చట గొలిపే మగువలతో తెలుగు లోగిళ్లన్ని నూతన శోభను సంతరించుకున్నాయి.
ఉరవకొండలో...
ఉరవకొండ పట్టణంలో భోగి వేడుకలు యువత ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. అంతా కలిసి భోగి మంటల వెలుగులో సంక్రాంతికి స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ విశిష్టత చాటుతూ సాంప్రదాయాలను గుర్తుచేసేలా చిన్న పెద్ద అంత కలిసి నృత్యాలు చేశారు. అందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆహ్వానించారు.
కదిరి..
కదిరి పట్టణంలో వేకువజామునే ప్రజలు భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ఆరంభించారు. ఇంటిలోని పాత వస్తువులను దహనం చేస్తూ చిన్నా, పెద్దా సందడి చేశారు. ముగ్గులు, గోబ్బెమ్మలతో తెలుగు వాకిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి.
బళ్ళారి తాలూకా కృష్ణా నగర్ ..
బళ్ళారి తాలూకా కృష్ణా నగర్ క్యాంపు కాలనీలో భోగి పండుగను మహిళలు అంగరంగ వైభవంగా జరిపారు. చిన్న, పెద్ద కలిసి ఆటపాటలతో వైభవంగా భోగి పండుగను జరిపారు. వీరి ఆట, పాట చూపరులను ఆకట్టుకుంది. సంక్రాంతి వైభవం ఉట్టిపడేలా మొదటి రోజు భోగితో కాలనీ ప్రజలు సందడి చేశారు.
ఇదీ చదవండి: