అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కరోనా నివారణ చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని వీధుల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటించటం ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరూ అతిక్రమించవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి