రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని అనంతపురం ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో మాజీ శాసనసభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ హాబీబ్ బాషా ప్రారంభించారు. రాకెట్ల గ్రామం నుంచి రైతు భరోసా కేంద్రం వరకు వీరు ఎడ్ల బండిపై వచ్చారు. రైతులకు అండగా నిలిచి వారికి సహాయం చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేంద్రాలతో రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఉపయోగపడుతాయన్నారు. రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'