ETV Bharat / state

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందాలు.. - కంబదూరు మండలం మర్రిమాకులపల్లి

Ruling Party MLA : అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భూదందాలు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్ పేరుతో వందల ఎకరాలు కొంటున్నారు. నిరుపేద రైతులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఎసైన్డ్ భూములపైనా కన్నేశారు. రైతులకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 77 ఎకరాలకు రైతుల నుంచి ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లు తెలుస్తోంది.

Ruling Party MLA
అధికార పార్టీ ఎమ్మెల్యే
author img

By

Published : Jan 20, 2023, 9:10 AM IST

అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందాలు..

Ruling Party MLA Land Occupation : పేదలకు పంపిణీ చేసిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్లు అసైన్డ్ భూములను ఓ అధికార ప్రజాప్రతినిధి లాగేసుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధి కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని. 217, 219, 220, 222, 223, 224, 225, 228 సర్వే నెంబర్లలోని ఎసైన్డ్ భూములను కొనేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎకరాకు 2లక్షల 40 వేల రూపాయల చొప్పున.. 77 ఎకరాలకు రైతులు నుంచి ముగ్గురి పేరుతో విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతుల్ని.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీవనాధారమైన పొలాలు కోల్పోతున్నా.. బయటికి చెప్పడానికి కొందరు రైతులు భయపడుతున్నారంటే బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మొలకనూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని మర్రిమాకులపల్లిలో పేద ఏస్సీ, బీసీ రైతులకు 1998లో ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. అప్పట్నుంచి వారు ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. వాటిని చౌకగా కొట్టేసేందుకు సదరు ప్రజాప్రతినిధి పథక రచన చేశారు. గ్రామంలోని ముగ్గురు వైసీపీ నాయకుల్ని రంగంలోకి దించి, రైతులతో బేరసారాలు నడిపారు. వారితో అగ్రిమెంట్లపై సంతకాలు చేయించారు. ఒక్కో రైతుకు 2 లక్షల రూపాయలు అడ్వాన్సు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా మొత్తం సొమ్ము చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 20 మంది రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకున్నారు. భూములు ఇవ్వకపోతే పొలాలకు వెళ్లే దారుల్ని మూసేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు.

"చుట్టుపక్కల అందరు ఇచ్చారు కదా నువ్వు కూడా ఇవ్వు అని నన్ను అడిగారు. నేను ఇవ్వాను అన్నాను. నేను ఇది వారికి ఇస్తే నేనెక్కడికి పోవాలి. నాకు ఉన్న అధారం ఇది ఒక్కటే. చాలా మందికి అడ్వాన్సులు ఇచ్చారు. చుట్టు అందరూ ఇచ్చారు, నువ్వు ఇవ్వకపోతే దారి లేకుండా అవుతుంది అని అన్నారు. ఏది ఏమైనా నేను ఇచ్చేది లేదని.. ఇవ్వలేదు. చాలా మంది నుంచి తీసుకున్నారు. " -రైతు

మర్రిమాకులపల్లిలో 100 ఎకరాలు సేకరించాలని ప్రజాప్రతినిధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అసైన్డ్ భూములకు ఆనుకుని పట్టా భూములున్న రైతులపైనా స్థానిక నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.