ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి ఐదేళ్ల విద్యార్థి మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్టీవో ఆధ్వర్యంలో పాఠశాల వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎల్ఎల్ఆర్తోనే ఓ ప్రైవేటు కళాశాల బస్సు నడుపుతున్న డ్రైవర్ను పట్టుకున్నారు. బడి బస్సులకు డ్రైవర్ మాత్రమే ఉండి.. క్లీనర్ లేకపోవడాన్ని గమనించారు. నిబంధనలు పాటించని పాఠశాలల బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆర్టీవో మధుసూదన్ తెలిపారు.
ఇదీ చదవండి: దిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతులు.. కేజ్రీవాల్ ఆందోళన