ETV Bharat / state

ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించాలి: ఆర్టీసీ ఎండీ - apsrtc md rp takur at anathapur

అనంతపురం ఆర్టీసీ డిపోను సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్ పరిశీలించారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలందించాలని అధికారులకు సూచించారు. డిపో ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.

rtc md visitt ananthapur bus depot
rtc md visitt ananthapur bus depot
author img

By

Published : Apr 2, 2021, 2:07 PM IST

Updated : Apr 2, 2021, 3:25 PM IST

ప్రయాణికులకు ఉత్తమ సేవలందించాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్​ అన్నారు. అనంతపురం ఆర్టీసీ డిపో, బస్ స్టాండ్లను ఠాకూర్ పరిశీలించి.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణీకులను గౌరవిస్తేనే.. ఆర్టీసీ బస్సు ఎక్కుతారని.. తద్వారా ఆదాయం పెరిగి సంస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. డిపోలో పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బస్ స్టాండ్ ప్రాంగణంలో ఖాళీ స్థలాలను పరిశీలించిన ఎండీ.. నిర్మాణాల ప్రణాళికపై ఆరా తీశారు. ఖాళీ స్థలాల్లో దుకాణ సముదాయం నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: ఎండలు.. మంటెక్కిస్తున్నాయి

Last Updated : Apr 2, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.