ETV Bharat / state

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి - దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

దైవదర్శనం కోసం ధర్మస్థలం వెళ్లి వస్తుండగా.. జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. అనంతపురం జిల్లా రాంనగర్​కు చెందిన నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు బేలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తాతా మనవరాలు మృతి చెందారు. ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.

Road accident on the way to and from the apparition
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 5, 2021, 10:03 AM IST

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం రాంనగర్ కు చెందిన నలుగురు కుటుంబసభ్యులు దైవదర్శనం కోసం కారులో ధర్మస్థలం వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా హనిమిరెడ్డిపల్లి వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలేశ్వర్ (62) సంఘటన స్థలంలో మృతి చెందగా, అతని మనుమరాలు శ్రీవిద్య(1) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కారులో ఉన్న యోగేశ్వర్​, సుప్రియ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థతి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.