అనంతపురం జిల్లా మడకశిరకు సరిహద్దు అయిన చంద్రబావి వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఏడుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి పావగడకు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. చంద్రబావి వద్దకు రాగానే వారి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇన్నోవా డ్రైవర్, మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా.. వారిని కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు పావగడ ప్రాంతానికి చెందినవారు కాగా.. మరో వ్యక్తి మడకశిర గ్రామస్థుడిగా పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: