అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పాఠశాలల నియంత్రణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి చెప్పారు. నార్పల మండలంలోని గంగనపల్లి, జంగంరెడ్డి పేట, రంగాపురం గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు ఆయన భూమి పూజ చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక రోడ్ల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో రూ.20 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:
పేరుకే సంపూర్ణ లాక్ డౌన్... ప్రభుత్వ మద్యం దుకాణం మాత్రం ఓపెన్!