అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కదిరి ప్రాంతీయ వైద్యశాలలో సమీక్ష జరిగింది. 10 మండలాలలకు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిని ప్రభుత్వం కొవిడ్ వైద్యశాలగా మార్చింది. కరోనా బాధితులకు పరీక్షలతోపాటు, సాధారణ రోగులు ఇబ్బంది పడకుండా వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంపై స్థానిక శాసన సభ్యుడు సిద్ధారెడ్డి వైద్యులు, అధికారులతో చర్చించారు.
ఇవీ చదవండి