ETV Bharat / state

ఉరవకొండ ఊరిని చూడు.. ఆ గ్రామం ఓ వనరుల రేడు! - ఉరవకొండ వార్తలు

గ్రామ పంచాయతీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నాయి. ప్రగతి మాత్రం అంతంత మాత్రమే. వాటికి ఎంపికైన పాలకులు వాటి అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగని పరిస్థితి. స్థానికంగానే వివిధ రూపాల్లో ఆదాయ వనరులను సృష్టించుకునే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ముందుకు సాగుతున్న వారు ఎక్కడా కనిపించడం లేదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని..! నేటికీ నమ్ముతూనే ఉన్నారు. ఏమీ చేయకుండానే ప్రజలిచ్చిన పదవీ కాలం ముగిసిపోతోంది. ప్రస్తుతం కొత్తగా ఎన్నికయ్యే పాలకులైనా సంపద సృష్టిపై దృష్టి సారించి ముందుకు సాగితే గ్రామ పంచాయతీలు అభివృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉరవకొండ మేజరు పంచాయతీలో ఆదాయ మార్గాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

revenue income
వనరుల రేడు
author img

By

Published : Feb 8, 2021, 3:21 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మేజరు పంచాయతీలో ఏటా వివిధ పన్నుల ద్వారా రూ.42 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. దాని ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

* పంచాయతీల్లో ఇళ్లు, నీరు, డ్రైనేజీ, గ్రంథాలయం, క్రీడల నిర్వహణ తదితర రూపాల్లో పన్ను వసూలు చేస్తున్నారు. నిర్దేశించిన మేర ఏటా ఆ పన్నులు వసూలు చేయడం లేదు. మేజరు పంచాయతీల్లో మినహా మిగతా పంచాయతీల్లో నామమాత్రంగానే వాటిని వసూలు చేస్తున్నారు. ఏటా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పన్నుల వసూలుపై పాలకులు దృష్టి పెడితే, వాటి రూపంలో కలిగిన ఆదాయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు.

దాతలు.. నిధులు

ఉన్నత స్థానాల్లో ఎక్కడెక్కడో ఉంటూ.. నేడు చాలా మంది తమ గ్రామాల అభివృద్ధికి చొరవ చూపుతున్నారు. అలాంటి దాతలను కొత్తగా ఎన్నికయ్యే పాలకులు గుర్తించి వారి ద్వారా ‘గ్రామాభివృద్ధి నిధి’ పేరుతో విరాళాలు సేకరించి వాటి నుంచి వచ్చే వడ్డీతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుంది. ఆ దిశగా పాలకులు దృష్టి సారిస్తే దాతలు ముందుకు రావడంతోపాటు, గ్రామాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలు

యాడికి మేజరు పంచాయతీలో వాణిజ్య సముదాయ భవనాల ద్వారా ఏటా గ్రామ పంచాయతీకి రూ.10లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. దీనిని ఆ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగిస్తున్న పరిస్థితి. ఇలాంటి ఆదాయం జిల్లాలో మరిన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఉంది.

* జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో వాటికి సంబంధించిన ఖాళీ స్థలాలు ఉంటున్నాయి. వాటిపై పాలకులు సరైన దృష్టి సారించకపోవడంతో అవి అన్యాక్రాంతం అవుతున్న సందర్భాలు లేక పోలేదు. వారు స్పందించి ఆ స్థలాలను అద్దెలకు ఇవ్వడం వల్ల ఆదాయం పొందొచ్చు. అదే స్థలాల్లో శాశ్వత రూపంలో వాణిజ్య సముదాయాలను గాని, ఇతర భవనాలను గాని నిర్మించి అద్దెలకు ఇచ్చినా నెలనెలా అద్దెల రూపంలో ఆదాయం పొందే వీలుంది.

చెరువు బలం

పీఏబీఆర్‌ కుడి కాలువ పరిధిలో సుమారు 42 చెరువులకు నీరిస్తున్నారు. వాటన్నింటిలో చేపల పెంపకానికి మార్గాలు ఉన్నాయి.

*రెండు మూడు సంవత్సరాలుగా హంద్రీనీవా, తుంగభద్ర జలాలు జిల్లాకు పుష్కలంగా లభిస్తున్నాయి. దీంతో జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులను ఆ నీటితో నింపుతున్నారు. అలాంటి చెరువుల్లో చేపల పెంపకానికి వేలాలు నిర్వహించడం ద్వారా పంచాయతీ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా పాలకులు తమ దృష్టి కేంద్రీకరించి, తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

ఫలసాయం

బ్రహ్మసముద్రం మండలం సంతే కొండూరు గ్రామ పంచాయతీ చింత ఫలసాయం ద్వారా ఏటా రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఆదాయం పొందుతోంది.

* గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ భూములు, స్థలాలు ఉంటున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచడానికి మార్గాలు చాలా అనువుగా ఉన్నాయి. ఆ దిశగా వాటిని మంచి ఆలోచనతో పెంచితే రెండు మూడు సంవత్సరాల తరువాత వాటి నుంచి ఏటా ఫల సాయం పొందే మార్గం ఏర్పడుతుంది. ఆ ఫలాలను ఏటా వేలం ద్వారా విక్రయించి పంచాయతీ ఆదాయం పొందేందుకు వీలుంటుంది.

చెత్త కాదు.. ఆదాయం చెంత

ఉరవకొండ మేజరు పంచాయతీలో రోజుకు 10 ట్రాక్టర్ల చెత్త లభ్యం అవుతుంది. దీన్ని తడి-పొడిగా వేరు చేయడం వల్ల ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది.

* పంచాయతీల్లో చెత్త నిర్వహణకు ప్రభుత్వం కొన్నేళ్లుగా వివిధ రకాల చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో సంపద సృష్టి కేంద్రాలను నిర్మించింది. గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి లభ్యమయ్యే తడి-పొడి చెత్తను సేకరించేందుకు వాహనాలను, కార్మికులను సమకూర్చింది. కాని పాలకుల ఆలోచన మెరుగు పడక పోవడంతో అవన్నీ అలంకార ప్రాయంగా మిగిలాయి. వారే కాస్త ఆలోచనతో ముందుకు సాగితే తడి-పొడి చెత్త ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు ఉన్నాయి. ఆ చెత్త ద్వారా వర్మీ కంపోస్టును సులభంగా తయారు చేయవచ్చు. వ్యవసాయ పరంగా దీనికి గ్రామాల్లో మంచి డిమాండు ఉంది. స్థానికంగా లభించడంతో రైతులు అది కొనడానికి ఆసక్తిని చూపుతారు. చెత్తను వేరు చేసినపుడు లభించే ఇతర వస్తువులను గుజరీకి అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. కాని పాలకులు ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో చాలా పంచాయతీల్లో ఉంది. కొత్త పాలకులు దృష్టి సారిస్తే ఆ దిశగా ఆదాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి:

అనంతపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.