కాలువలో ఈతకు వెళ్ళిన ఇద్దరు చిన్నారులు కొట్టుకుపోతూ సుడిగుండంలో చిక్కగా.. వారిని రక్షించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం బందార్లపల్లిలో జరిగింది.
బందార్లపల్లి సమీపంలోని యాడికి కాలువకు అధికారులు ఇటీవల నీరు వదిలారు. బందర్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు కాలువలో ఈత కొట్టే సమయంలో నీరు అధికంగా రావడం వల్ల చిన్నారులు కొట్టుకుపోసాగారు. ప్రక్కనే పొలంలో పని చేస్తున్న హనుమంతరెడ్డి(34) గమనించారు. వెంటనే అప్రమత్తమై కాలువలోకి దూకి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. కానీ అతను మాత్రం సుడిగుండంలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. చిన్నారులను రక్షించి అతను విగతజీవిగా మారడంపై హనుమంతురెడ్డి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి