అనంతపురం జిల్లా ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఫెర్రర్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
గాండ్లపెంట మండలంలోని ఆర్డీటీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలల్లో విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం హుండీలను అందచేశారు.
ఇదీ చదవండి: