అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పట్టణంతో పాటు గ్రామాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం నియోజకవర్గ గుడిబండ మండలంలోని మద్దనకుంట, తిమ్మలాపురం, కే.కే. పాలెం గ్రామాల్లో కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. అధికారులు బాధితుల్ని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
గ్రామాల్లో హైపోక్లోరిన్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఆర్డీటీ సంస్ధ రీజినల్ డైరెక్టర్ రామేశ్వరి, కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా బాధిత గ్రామాల్లోని 450 కుటుంబాలకు 2460 మాస్కులు పంపిణీ చేసి, కరోనా నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి