అనంతలో పింఛన్ల తొలగింపుపై తెలుగు యువత నాయకుల ర్యాలీ - rally at anantapur dst about pension cancellation
తొలిగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. డీఆర్డీఏ కార్యలాయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 40 వేల పింఛన్లు మంజూరు చేశామని చెప్పిన ప్రభుత్వం 70 వేల పింఛన్లు ఎలా తొలగించారని తెలుగు యువత అధ్యక్షుడు ప్రశ్నించారు. తక్షణమే రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి అర్హులను పరిశీలించి వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పింఛను తొలగింపుపై అనంతపురం జిల్లాలో నిరసన