ETV Bharat / state

రాయలసీమలో ఈదురుగాలులతో.. వానలు - rains latest news

రాయలసీమలో ఒక్కసారిగా వర్షాలు కురిశాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. అకాల వర్ష ప్రభావానికి పలు చోట్ల విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

rains in seema
వానలు
author img

By

Published : May 11, 2021, 7:35 PM IST

రాయలసీమ జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వానలు కురిశాయి. ఎండ తీవ్రతకు అతలాకుతలమవుతున్న జనాలు ఒక్కసారిగా చల్లటి వాతావరణానికి పులకరించిపోయారు. పలు చోట్ల అకాల వర్షాల కారణంగా రవాణా స్తంభించిపోయింది. దీంతో పాటు అక్కడడక్కడ పిడుగులు పడ్డాయి. రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

పిడుగు పాటుకు ఎద్దులు మృతి..

rains in seema
మృతి చెందిన ఎద్దులతో రైతు

కర్నూలు జిల్లా నందవరంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామంలోని తలమారి రాజుకు చెందిన ఎద్దులను తన ఇంటి ముందు కట్టి ఉంచగా.. పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. చనిపోయిన ఎద్దుల విలువ లక్ష రూపాయలు వరకు ఉంటుందని యజమాని తెలిపాడు. కాడెద్దులు అకాల మృతితో రైతు తీవ్ర ఆవేదన చెందాడు.

ఉపశమనం..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక్కసారిగా కురిసిన వానకు వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో సతమతమైన జనాలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలుల కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు

'దురుద్దేశంతోనే సెంట్రల్​ విస్టాపై పిటిషన్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.