అనంతపురం జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురస్తున్న వర్షాలకు వేరుశనగ పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. పామిడి, కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు తదితర మండలాల్లో పది సెంటీమీటర్లకు మించి భారీ వర్షం నమోదైంది. వేరుశనగ లేత మొక్క దశలో ఉండటంతో రోజూ కురుస్తున్న వర్షాలకు అనేక రకాల పురుగులు, మొదలు కుళ్లు తెగుళ్లు సోకుతున్నాయి. మరోవైపు శనగపచ్చ పురుగు లేత ఆకులను రంద్రాలు చేసి తినేస్తోంది. పచ్చదోమ ఆకుల కింది భాగంలో ఉండి రసం పీల్చుతుండటంతో ఆకులు పేలవంగా మారిపోయి రాలిపోతున్నాయి. దీంతో వేరుశనగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీటితో రైతులు అధైర్యపడొద్దని, వర్షాలు తగ్గాక పంట మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పలు మండలాల్లో పంటలను పురుగులు ఆశించినట్లు గుర్తించిన వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం