ETV Bharat / state

ఆశలపై నీరు చల్లిన కరోనా.. మళ్లీ పాత కష్టాలే - అనంతపురంలో రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిర్మించుకున్న ఇమాంపురం గ్రామస్థులు

Railway platform: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురు చూడలేదు.. సర్కారు చూసుకుంటుందిలే అనుకోలేదు.. ఏ పనైనా పదిమంది పంచుకుంటే కష్టం తెలియకుండా పోతుందన్నట్లు.. ఊరంతా ఏకమయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఈమామ్​పురం గ్రామస్థులంతా కలిసి సొంత ఖర్చుతో రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిర్మించుకున్నారు. వాళ్ల ఊరి రైల్వేస్టేషన్‌లో రైలు ఆగేలా చేసుకున్నారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా రైలు ఆగకపోవడంతో.. మళ్లీ వారికి ఇబ్బందులు మొదలయ్యాయి.

railway platform constructed by villagers but no trains were being stopped at imampuram in ananthapur district
రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిర్మించుకున్నా.. ఆగని రైలు
author img

By

Published : Jul 19, 2022, 5:49 PM IST

రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిర్మించుకున్నా.. ఆగని రైలు

Railway platform: అనుకున్నది సాధించాలనే సంకల్పం గట్టిగా ఉంటే.. ఏ పనీ అసాధ్యం కాదని నిరూపించారు.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఈమామ్​పురం గ్రామస్థులు. తమ గ్రామం వద్ద రైలు నిలపాలనే పట్టుదల.. రైల్వేశాఖ చేయాల్సిన పనిని ఇమాంపురం గ్రామస్థులతో చేయించింది. గుంతకల్లు మండలంలోని ఓ మూలకు విసేరిసినట్లుగా ఉండే ఈమామ్​పురం గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఒకవేళ బస్సు ఎక్కాలంటే దాదాపు ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామం మీదుగా వెళ్తున్న రైలు.. గ్రామస్థులకు ఉపయోగపడటం లేదు.

రోజూ వందలాది మంది దినసరి కూలీలు గుంతకల్లు, అనంతపురానికి వెళ్లి రావాల్సి వస్తుంది. 50 మందికిపైగా విద్యార్థులు ఈమామ్​పురం పక్కనే ఉన్న గ్రామం నుంచి కళాశాలలకు వెళ్తున్నారు. వీరంతా గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లి, అక్కడినుంచి బస్సులో చేరుకుంటున్నారు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ధర్మవరం నుంచి వచ్చే ప్యాసింజర్ రైలు ఎక్కుతున్నారు.

రైలు ఈమామ్​పురం వద్దకు రాగానే రైలు గొలుసు లాగి అంతా దిగుతున్నారు. నడిచే రైలులో చైన్ లాగటం రైల్వే చట్టం ప్రకారం నేరం కావటంతో గ్రామస్థులపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసులు పెడుతూ.. జైలుకు పంపేవారని స్థానికులు చెప్తున్నారు.

ఈమామ్​పురం గ్రామం వద్ద రైలు నిలపాలని 2015 నుంచి గ్రామస్థులు పోరాటం చేస్తున్నారు. గ్రామం వద్ద రైలు నిలపాలంటే ప్రజలే సొంత ఖర్చుతో ప్లాట్‌ఫాం నిర్మించుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఎలాగైనా తమ గ్రామం వద్ద నిలపాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న గ్రామస్థులు.. అందుకు తామంతా సిద్ధమేనని రైల్వే అధికారులకు చెప్పారు. రైల్వే ఇంజినీర్ల పర్యవేక్షణలో గ్రామస్థుల శ్రమదానంతో ఏడున్నర లక్షల రూపాయలు చందాలు వేసుకుని ఆరు నెలల్లో ప్లాట్‌ఫాం నిర్మించారు.

రైల్వే అధికారులు కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ 2017లో ఈమామ్​పురం రైల్వే స్టేషన్‌కు అధికారిక గుర్తింపు ఇస్తూ.. ప్యాసింజర్ రైలుకు హాల్ట్ ఇచ్చారు. ఇలా రెండున్నరేళ్లపాటు గ్రామస్థులకు సౌకర్యవంతంగా ఉన్న రైలుతో కూలీలు, విద్యార్థులు ప్రయోజనం పొందారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేశారు. మళ్లీ పునరుద్ధరించినా.. కొన్నిచోట్ల హాల్ట్‌లను ఎత్తివేయటంతో ఈమామ్​పురం ప్రజలకు పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

కరోనా మహమ్మారి కారణంగా రైలు ఆపకుండా వెళ్లడంతో.. గ్రామాస్థులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు స్పందించి తమ ఊరి వద్ద రైలు ఆపాల్సిందిగా కోరుతున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.