అనంతపురం జిల్లాలోని చిత్రావతి జలాశయం ముంపు పరిహార జాబితాలో అనర్హులకు చోటు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ముదిగుబ్బ మండలం రాఘవపల్లి వాసులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద పరిపాలనాధికారిని కలిసి వారి సమస్యలను వివరించారు.
ముదిగుబ్బ రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన 20 మంది పేర్లు జాబితా నుంచి తొలగించి గ్రామంలో నివాసంలేని ఇతర ప్రాంతాల వారి పేర్లను జాబితాలో చేర్చారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. అర్హులందరికీ పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: