అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిలోని క్వారీ కార్మికులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కొక్కంటి వద్ద అడవి ప్రాతంలో బండలు, భవన నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను కొడుతూ జీవనం సాగించే తమను కొందరు పనులు చేయొద్దంటూ ఆంక్షలు పెడుతున్నారని కార్మికులు వాపోయారు. కరోనాను సాకుగా చూపి స్థానిక నాయకుల ఆదేశంతో వాలంటీర్లు తమను పని చేసుకోనివ్వడం లేదని తహసీల్దార్ సుబ్బలక్ష్మికి తెలిపారు. కార్మికుల ఉపాధికి ఇబ్బంది తలెత్తకుండా సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈ మేరకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వ జాప్యం.. అధికారుల అలసత్వం: నిమ్మగడ్డ