అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయాల పాలయ్యారు. ఇసుక వివాదంలో మాట మాట పెరిగి.. రెండు వర్గాలూ కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా.. మరో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని.. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: