అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో.. దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారికి పట్టణ మహిళలు మహా పుష్పయాగం నిర్వహించారు. సువాసన కలిగిన 11 రకాల పుష్పాలను బుట్టల్లో పెట్టుకొని వీధుల్లో ప్రదర్శనగా నడచి వచ్చారు. మహిళలందరూ ఏకరూప దుస్తులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆలయమూర్తులకు అభిషేకాలు చేశారు. పుష్పయాగం అనంతరం.. అమ్మవారి విగ్రహానికి సంకల్ప, అభిషేక పూజలు నిర్వహించారు. అర్చకులు మహామంగళ హారతి, తీర్ధ, ప్రసాద వినియోగం చేశారు.
ఇదీ చదవండి: