అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గోరంట్లలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదనే అక్కసుతో ఓ యువకుడు యువతికి పురుగుల మందు తాగించి అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెలిగొండ గ్రామానికి చెందిన బాధిత యువతి ఉద్యోగం నిమిత్తం గోరంట్లలో ఉంటోంది. నెల రోజుల నుంచి గుర్తు తెలియని యువకుడు ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధించసాగాడు. అతన్ని ప్రేమించడానికి యువతి ఒప్పుకోనందున ఆమెతో బలవంతంగా పురుగులమందు తాగించాడు. యువతి భయంతో కేకలు వేయగా ఇంటి పక్కనే బంధువులు, స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా.. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: