ఇవీ చదవండి:
pensioners: పింఛన్ ఇవ్వకపోగా.. అధికారికంగా చంపేశారు...
Problems of pensioners: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అర్హులైన కొందరికి పెన్షన్ అందటం లేదు. గ్రామ సచివాలయంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. మండలంలోని షేక్షానుపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్పకి 2019లో వృద్ధాప్య పింఛన్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి సచివాలయం చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బతికుండగానే అధికారికంగా చంపేశారు
pensioners in Anantapur district: బతికుండగానే చనిపోయినట్లు నమోదు చేయడంతో ఓ వృద్ధురాలికి పింఛన్ అందడంలేదు. ఉరవకొండ మండలం నెరమెట్ల గ్రామానికి చెందిన లీలావతి 2021లో వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఐడీ కేటాయించి పింఛన్ పుస్తకం అందించారు. కొత్తగా మంజూరైన పింఛన్లపై ఈ ఏడాది జూన్ నెలలో థర్డ్ పార్టీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఆమె మృతి చెందినట్లు అధికారులు అన్లైన్లో నమోదు చేయడంతో వృద్ధురాలి పేరు అనర్హత జాబితాలోకి వెళ్లి పింఛను మంజూరు ఆగిపోయింది. అధికారులు చేసిన తప్పిదాన్ని కలెక్టరేట్ స్పందనలోనూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. తనకు పింఛన్ రాకపోయినా పర్వాలేదు చనిపోయానని అనడం చాలా బాధను కలిగించింది అని ఆమె కంటతడి పెట్టారు.ఇలాంటి పరిస్థితే ఉరవకొండ మండలంలోని షేక్షానుపల్లికి నెలకొంది. గ్రామానికి చెందిన తిప్పన్న అనే వృద్ధుడు, హేమలత అనే దివ్యాంగురాలు కూడా ఎదుర్కొంటున్నారు. తిప్పన్న కూతురుకు ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లిపోగా రేషన్ కార్డులో ఆమె పేరు అలాగే ఉండడంతో కొన్ని నెలల క్రితం వారి కార్డు తొలగించారు. తిరిగి కార్డులో కూతురి పేరు తొలగించి తిరిగి దరఖాస్తు చేసుకోగా ఇంతవరకు పింఛన్ అందలేదని పేర్కొన్నాడు. ఇదే విషయమై అధికారులను అడగ్గా ఆన్లైన్లో చనిపోయినట్లు చూపించారు. దీంతో అతనికి ఎం చేయాలో అర్థం కాక సచివాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. వారిని తిరిగి అర్హుల జాబితాలోకి చేర్చాలని కోరుతూ డీఆర్డీఏ పీడీకి నివేదించామని ఎంపీడీఓ అమృతరాజ్ తెలిపారు. బాధితులు తిరిగి కొత్త పింఛన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 22, 2022, 6:04 PM IST