అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పరీక్షలు అడ్డుకొని విద్యార్థులను అక్కడి నుంచి పంపించివేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని పరీక్షలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: సాగర తీరం .. ఇకపై మరింత ఆకర్షణీయం!