అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంగన్ వాడి కేంద్రంలో వంట చేస్తుండగా ప్రెజర్ కుక్కర్ పేలింది. హెల్పర్ మంగమ్మకు కొద్ది పాటి గాయాలయ్యాయి. రోజూ చిన్న పిల్లలు, గర్భిణీలు ఈ సెంటర్కు వస్తుంటారు. సోమవారం హెల్పర్ మంగమ్మ వంట చేస్తుండగా ప్రెజర్ కుక్కర్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. గాయాలపాలైన మంగమ్మను అక్కడివారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి