ETV Bharat / state

గృహ విద్యుత్​ బిల్లులు కట్టలేదని.. వ్యవసాయ మోటార్లకు పవర్ కట్ - అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు

Power cut to farm motors: ఓబులాపురంలో విద్యుత్​ శాఖ అధికారుల తీరు అందరూ ఆశ్యర్యపోయేలా చేస్తోంది. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్​ బకాయిల కట్టలేదని.. వ్యవసాయ మోటార్లకు వచ్చే లైనుకు విద్యుత్​ సరఫరా కట్​ చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Power cut to farm motors
వ్యవసాయ మోటార్లకు పవర్ కట్
author img

By

Published : Jan 10, 2023, 3:43 PM IST

Power cut to farm motors: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామంలో పలు రైతులు మొక్కజొన్న, వేరుశనగ, మిరప వంటి పంటలకు 15, 20 రోజుల నుంచి నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయని.. దీంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గృహ వినియోగానికి సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కారణం చూపి వ్యవసాయ మోటార్లకు వచ్చే లైనుకు కూడా సరఫరా తీసేయడంతో మోటార్లు ఆడక తాము పంటను నష్టపోతున్నామని తీవ్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల నుంచి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీరు లేక ఎండిపోతున్న పంటలు

మాకు తెలియకుండా సర్వీస్ వైర్లు కట్ చేసుకెళ్లారు.ఎవరో ఊళ్లో డబ్బులు కట్టలేదని మా సర్వీస్ వెర్ కట్ చేసుకుపోయారు. అదే లైన్ కట్​చేసే బదులు ఇంటికొచ్చి బిల్లు కట్టలేదు లైన్ కట్​చేస్తామని అంటే మేము కడతామన్నా వినిపించుకోకుండా లైన్ కట్​చేసి పోయారు. - రైతు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.