అనంతపురంజిల్లా గుంతకల్లు తహసీల్దారు కార్యాలయం ఎదుట తమ ఇళ్ల స్థలాలు తమకు ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. కొంతమంది స్థానిక వైకాపా నేతలు తమ ఇళ్ల పట్టాలు ప్రభుత్వం రద్దు చేసిందంటూ... తాము నిర్మించుకున్న పునాదుల్ని కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2008-09 సంవత్సరంలో సర్వే నెంబర్ 47ఏ, 37ఏలో కొంతమంది పేదలకు ఇందిరమ్మ గృహాలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోక... కేవలం పునాదులు మాత్రమే వేసుకొని వదిలేశామని వారు చెబుతున్నారు. ఇప్పుడు వైకాపా నాయకులు వచ్చి వాటిని తొలగించారని చెబుతున్నారు. ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా అంటూ బాధిత మహిళలు ఆవేదన చెందుతున్నారు. వారి ఆందోళనకు ఓపీడీఆర్, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: