అనంతపురం జిల్లా వజ్రకరూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటపల్లి, బోడసానిపల్లి తండా సమీపంలోని సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఏఎస్పీ రామ్మోహన్రావు, ఆయన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా సారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రామ్మోహన్ హెచ్చరించారు.
ఇవీ చదవండి:ఎరుపు రంగులో ప్రవహిస్తోన్న గోదావరి