ETV Bharat / state

అనంతపురం జిల్లాలో 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి మండలాల్లో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 75 లీటర్ల నాటుసారాతోపాటు, 1800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

local liquor at anantapur district
అనంతపురం జిల్లాలో 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
author img

By

Published : Oct 18, 2020, 4:55 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు చేశారు. పులగుట్టపల్లి, పెద్దతండా, చిన్నతండా, గుండాల తండాలో తనిఖీలు నిర్వహించి.. 75 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారాతో పాటు 1800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ రాము తెలిపారు.

గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో 50 లీటర్ల నాటుసారాను పట్టుకున్నామని సీఐ సుభాషిణి తెలిపారు. అలాగే మరో చోట సారా తయారీలో ఉపయోగించే బెల్లాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి ..అతని వద్ద నుంచి 90 కేజీల బెల్లంతో పాటు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా నాటుసారా తయారుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఇదీ చూడండి.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.