ETV Bharat / state

వివిధ ప్రాంతాలలో గంజాయి పట్టివేత..నాటుసారా ధ్వంసం

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో టాస్క్​ఫోర్స్, పోలీసులు, ఇన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నాటుసారాను ధ్వంసం చేశారు. పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

police take over ganja anad local liquor
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో గంజాయి పట్టివే
author img

By

Published : Sep 15, 2020, 11:48 PM IST

అనంతపురం జిల్లాలో..

విడపనకల్ కొండ ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొందరు వ్యక్తులు నాటుసారా తయారు చేస్తునట్లు పోలీసులకు సమాచారం రావడంతో...సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. 6 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా అమ్మినా, గ్రామ శివారులో నాటుసారా తయారు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విడపనకల్ ఎస్ఐ గోపి తెలిపారు.

పులగుట్టపల్లి చిన్న తండా గ్రామ సమీపంలోని కొండగుట్టలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 650 లీటర్ల నాటుసారా బెల్లం ఊట ధ్వంసం చేసి,20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. నాటుసారా తయారుచేసే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటుసారా అక్రమంగా తయారుచేసినా విక్రయించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా పామిడి మీదుగా అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. పామిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎద్దులపల్లి కూడలిలో సీఐ శ్రీనివాస్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ...కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి అక్రమంగా కారులో మద్యం తీసుకు వస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ముజాహిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లతో పాటు, మద్యాన్ని తీసుకెళ్తున్న కారును కూడా సీజ్ చేశారు. ముజాహిద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో..
మంత్రాలయం మండలంలోని వగరూరు వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారుల దాడుల్లో 960 ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్న వగరూరుకు చెందిన తలారి శివ, గుజ్జుల చిన్న దస్తగిరిని అరెస్టు చేసినట్లు సీఐ మహేష్ కుమార్ చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లాలో విదేశీ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన సుధాకరన్‌ బాలకృష్ణన్‌ అనే వ్యక్తి నుంచి 20 విదేశీ మద్యం, 24 బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బాలకృష్ణన్‌ పవర్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మద్యం సీసాలు కొనుగోలు చేసి ఇంటిలో ఉంచుతున్నాడు. వాటిని చినవాల్తేరుకు కారులో రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం సీసాలను, కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సైలు తెలిపారు.

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు తగరలిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ దిల్లీకి చెందిన జాఫర్ అలీ, బిహార్​కు చెందిన గుడ్డు కుమార్, పశ్చిమ బంగాకు చెందిన షేక్ సమీమ్, షాహిల్ షేక్, యూపీకి చెందిన అవదేష్ కుమార్​లు ముఠాగా ఏర్పడి విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు మార్గం గుండా గంజాయిని తరలించేందుకు సిద్ధం చేసుకున్నారు. రైలులో ఏసీ బోగీల్లో పనిచేసే ఉద్యోగి సహకారం చేశారు. గవర కంచరపాలెం సమీపంలో ఓ ఇంట్లో నుంచి గంజాయిని తరలిస్తున్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, కంచరపాలెం ఎస్ఐ లోకేశ్వరావు సంయుక్తంగా దాడులు చేసి..ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 120 కేజీల గంజాయి రూ.13 వేల నగదు, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రావణ్ కుమార్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో..

పాలకొండ పట్టణంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బస్సు​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ బ్రాంచ్, రెవెన్యూ అధికారులు, ఎస్ఐ జనార్దన్ రావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సుబ్బు అనే వ్యక్తి పాలకొండ చెందిన బుద్ధ అప్పన్న అని వ్యక్తికి గంజాయి సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సీఐ సునీల్ కుమార్, ప్రభుత్వ డాక్టర్ రఘురాం ఆధ్వర్యంలో తూకం వేసి 1.5 కేజీలుగా నిర్దారించారు. మొట్టమొదటిసారిగా పాలమూరు పట్టణంలో గంజాయి పట్టుబడడంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా యువత గంజాయి బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి. 'సంక్రాంతి నాటికి అంతర్వేది రథం సిద్ధం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.