కర్ణాటక సరిహద్దుల్లో జోగిని, దేవదాసి వ్యవస్థల పేరిట నేటికీ చిన్నారుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంప్రదాయం అనంతపురం జిల్లాలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన ప్రజలను పట్టి పీడిస్తోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని డీహీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో.. ఇద్దరు చిన్నారులను జోగినులుగా మార్చేందుకు జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ బాలికలను రక్షించారు.
సీఐ రాజా, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, సంయుక్తంగా ఆయా గ్రామాలకు వెళ్లి ఈ ఘటనను అడ్డుకున్నారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించి అమ్మాయిలకు విముక్తి కల్పించారు. వీరిలో ఒకరిని అనంతపురం బాల సదన్‌కు... మరొకరిని ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు నిమిత్తం చేర్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఇదీ చదవండి:
సిక్కోలులోని వ్యవసాయ కనెక్షన్లకు నగదు బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు!