అనంతపురం జిల్లా గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని కల్లురొప్పం, తుమ్మలమారెమ్మ గ్రామాల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పట్టుకున్నారు.
వారి నుంచి 10 వేల రూపాయల నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: