అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 1770 మాత్రమే లభ్యమయ్యాయి.
ఈ దాడుల్లో పట్టుబడిన ఆరుగురిని పోలీసులు ఉరవకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఉరవకొండ ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు. జూదం ఆడుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం