అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో మద్యం అక్రమ రవాణా పై పోలీసులు దాడి చేశారు. పులమతి గ్రామం వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేయగా... మరొకరు పరారైనట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1536 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...