పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు. అమరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా సప్తగిరి కూడలిలో కళాజాత బృందంతో కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసు వృత్తిలో ఎదురయ్యే సమస్యలు, ప్రజలకు చేస్తున్న సేవలు, మహిళా రక్షణకు తీసుకుంటున్న చర్యలను కళాకారులు ప్రదర్శనల ద్వారా తెలియజేశారు.
క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పోలీసు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. వారోత్సవాల ద్వారా పోలీసుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: ధర్మవరంలో పోలీసుల రక్తదాన శిబిరం