ETV Bharat / state

పోలీసుల అత్యుత్సాహం.. మహిళలు, వృద్ధులపై దాడి - హిందూపురంలో భూ కబ్జాపై తాజా వార్తలు

వివాదాస్పదంగా ఉన్న ఓ భూమి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా వ్యవహరించారు. వృద్ధులు, మహిళలు అని చూడకుండా వారితో అమర్యాదగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. బాధితులపై పోలీసులు చేయి చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్​ అయ్యాయి.

police hit women, old people at hindhupuram
పోలీసులు, స్థానికుల మధ్య గొడవ
author img

By

Published : Dec 7, 2020, 1:50 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ భూవివాదమై.. పోలీసులు మహిళలు, వృద్ధులపై దురుసుగా ప్రవర్తించారు. రియల్​ ఎస్టేట్ వ్యాపారికి వత్తాసు పలుకుతూ వారిని దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్​ అయ్యింది.

పోలీసులు, స్థానికుల మధ్య గొడవ

హిందూపురం పట్టణానికి కిలో మీటరు దూరంలోని మోత్కుపల్లి సమీపంలో అధికార పార్టీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరి నుంచి 94 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. ప్లాట్లుగా వేసి వాటిని విక్రయిస్తున్నారు. పక్కన ఉన్న పొలం కూడా ఆక్రమించుకున్నాడని మోత్కుపల్లికి చెందిన సోము అనే వ్యక్తి గతంలో పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అక్కడికి ఇరువర్గాలు వెళ్ల వద్దని.. ఇరువర్గాల వారికి సర్ది చెప్పి పంపించారు.

అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆదివారం.. ప్రహరీ నిర్మాణం తిరిగి ప్రారంభించడంతో బాధితులు అడ్డుకున్నారు. రంగ ప్రవేశం చేసిన హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి వత్తాసు పలుకుతూ బాధితులపై చేయి చేసుకొని గాయపరిచారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఆరా తీసి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: ఏలూరు బాధితులను పరామర్శించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.