అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా ఈ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఈచలడ్డి గ్రామంలో రంగప్ప అనే వ్యక్తి వద్ద ద్విచక్రవాహనంలో మద్యం లభ్యమైంది. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని , మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండీ...