అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. అరవిందనగర్ ఓబుల్ దేవ నగర్ తదితర పరిసర ప్రాంతాల్లో రెండో పట్టణ పోలీసులు సీఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరత్రా అంశాలను వివరిస్తున్నారు. గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ లాంటి వస్తువులను అనుమతించబోమని తెలిపారు. ఓటర్లు ఇప్పటి నుంచే తమ ఓటు వివరాలను సరిచూసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు.
ఇవీ చూడండి...: విమానాశ్రయం లాంటి హంగులతో గుంతకల్ రైల్వే స్టేషన్