కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలను తెలుపుతూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు. మడకశిర నియోజకవర్గం అగలి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కరోనాను నిర్మూలించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. పట్టణ కూడలిలో యముడి వేషధారణలో నాటికను ప్రదర్శించారు. యముడి వేషధారులు పురవీధుల్లో తిరుగుతూ పలు సూచనలు చేశారు.
యముడి వేషదారణలో పోలీస్ సిబ్బంది నాటక ప్రదర్శన - మడకశిరలో యముడి వేషదారణలో పోలీస్ సిబ్బంది ప్రదర్శన
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ... అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. యముడి వేషధారణలో వీధుల్లో తిరుగుతూ.. ప్రజలెవరూ బయట తిరగకుండా ఇళ్లల్లోనే పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలని సందేశమిచ్చారు.
![యముడి వేషదారణలో పోలీస్ సిబ్బంది నాటక ప్రదర్శన police creates awareness about corona prevention in unique way at ananthapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6844495-469-6844495-1587219078069.jpg?imwidth=3840)
మడకశిరలో కరోనా నివారణపై పోలీసుల వినూత్న ప్రదర్శన